ఆ హీరోయిన్లు అంటే చాలా ఇష్టమంటున్న బాలకృష్ణ

లెజెండరీ నటుడు నందమూరి తారక రామా రావు వారసుడిగా టీనేజ్ లోనే సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ, ఆ తర్వాత హీరోగా ‘మంగమ్మగారి మనవుడు’ సినిమాతో స్టార్ హీరో గా ఎదిగాడు. కెరీర్ లో వంద సినిమాలు పైగా పూర్తి చేసిన బాలకృష్ణ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే తన తండ్రి లాగ జానపద, పౌరాణిక సినిమాల్లో కూడా నటించి, మెప్పించాడు.

కెరీర్ లో ‘ముద్దుల మావయ్య’, ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’, ‘సమర సింహ రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లాంటి సినిమాల్లో నడిచిన బాలకృష్ణ తన కెరీర్ లో విజయ శాంతి, రాధ, భానుప్రియ, రమ్య కృష్ణ, సౌందర్య, మీనా, రోజా, దివ్య భారతి, రంభ లాంటి ఎంతో మంది  స్టార్ హీరోయిన్స్ తో నటించాడు. కానీ తనకు మాత్రం ఇద్దరు హీరోయిన్స్ అంటే చాలా ఇస్తామని, ఆ హీరోయిన్లలో ఆయనకు కంఫర్ట్ గా అనిపించింది.. ఆయన మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుందంట. వాళ్ళు ఎవరో కాదు అందాల బ్యూటీ సిమ్రాన్.. హాట్ బ్యూటీ నయనతార.

సిమ్రాన్ తో బాలకృష్ణ ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘సీమ సింహం’ సినిమాలు చేసాడు. నయనతార తో ‘సింహ’ సినిమా చేసాడు. తాజా గా ‘అఖండ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయనున్నాడు.