సాధారణంగా యంగ్ హీరోలు సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతారు. సీనియర్ హీరోలు మాత్రం తాపీగా ఏడాదికి ఒకటి అర చేస్తూ ఉంటారు. ఇన్నాళ్లు నందమూరి బాలకృష్ణ కూడ చేసింది అదే. నిదానంగానే సినిమాలు చేస్తూ వెళ్లారు ఆయన. కానీ ఇప్పుడు ఆయన స్టైల్ మారింది. వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలకి సైన్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు చూసుకున్నా బాలకృష్ణ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అన్నీ కన్ఫర్మ్ అయినవే. గత కొన్నేళ్లలో బాలకృష్ణ చేతిలో ఇన్ని సినిమాలు ఉండటం జరగలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తున్నారు. త్వరలోనే అది పూర్తవుతుంది.
దాని తరవతా క్రాక్ ఫేమ్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమా చేస్తారు. అది ముగిసిన వెంటనే తన కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారు. అది అయిన తర్వాత హారికా హాసిని బ్యానర్లో ఒక సినిమా ఉంటుంది. అది అయ్యాక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒకటి దాని తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ఉంటుంది. ఇలా దాదాపు మూడేళ్ళకి సరిపడా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. మరి ఉన్నపళంగా బాలకృష్ణలో వచ్చిన ఈ ఊపుకు రీజన్ ఏంటో మరి. ఈయనే కాదు మరొక సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సైతం ఇలాగే సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నారు.