బాలయ్య హరీష్ శంకర్ కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ అయినట్టేనా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలయ్య రెమ్యునరేషన్ సైతం గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగింది. బాలయ్య ప్రస్తుతం అఖండ2 సినిమాతో బిజీగా ఉన్నారు. అఖండ2 సినిమా ఈ ఏడాదే విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అఖండ2 సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే బాలయ్య హరీష్ శంకర్ కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ అయినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ఓటేస్తున్నారు. బాలయ్య సినిమాలు ఓటీటీలలో కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. అయితే ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అంతకంతకూ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో హరీష్ శంకర్ బాలయ్యతో సినిమాపై దృష్టి పెట్టారని భోగట్టా. గతంలో జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్ లో రామయ్యా వస్తావయ్యా సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. అబ్బాయికి హిట్ ఇవ్వని హరీష్ శంకర్ బాబాయ్ కు హిట్ ఇస్తారేమో చూడాలి.

బాలయ్య తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ స్టార్ హీరో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.