Home News ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య

ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ ఏ సినిమా చేసినా కూడా అభిమానుల్లో అలా స్పెషల్ బజ్ క్రియేట్ చేస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన నెక్స్ట్ సినిమాల రేంజ్ ని అమాంతంగా పెంచేస్తుంటారు. కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస సినిమాలకు ఓకే చెప్పెస్తున్నాడు తెలుగు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.

Balaiah | Telugu Rajyam

ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ కథకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ సినిమాను కూడా ఒప్పుకున్నాడట.

తాజాగా డైరెక్టర్ బి.గోపాల్‏తో కలిసి మరో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో నరసింహనాడు, సమరసింహరెడ్డి లాంటి భారీ యాక్షన్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక బాలయ్య కోసం ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా కూడా ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా సమాచారం.

వీరితోనే కాకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇంతకు ముందు బాలయ్య, పూరీ జగన్నాథ కాంబినేషన్లో పైసా వసూల్ చిత్రం వచ్చింది. ప్రస్తుతం బాలయ్య మొత్తానికి 5 సినిమాలకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Posts

Akanksha Sharma

Akanksha Sharma, Akanksha Sharma phots, Akanksha Sharma stills, Akanksha Sharma gallery, Akanksha Sharma pics, Akanksha Sharma phots, model, actress ...

Poonam Bajwa

Poonam Bajwa, Poonam Bajwa pics,Poonam Bajwa stills, Poonam Bajwa phots, Poonam Bajwa latest stills, model, actress ...

Amyaela

Amyaela, Amyaela pics, Amyaela stills, Amyaela phots, Amyaela model, Amyaela latest pics ...

Latest News