Gallery

Home News శ్రీదేవికి ఎన్టీఆర్ ఎలా పాఠాలు నేర్పారో ఇలాగేనా చెప్పడం బాలయ్య

శ్రీదేవికి ఎన్టీఆర్ ఎలా పాఠాలు నేర్పారో ఇలాగేనా చెప్పడం బాలయ్య

Balakrishna | Telugu Rajyam

నందసమూరి బాలకృష్ణ మీడియా ముందుకొచ్చి పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇస్తే మాత్రం అవి తప్పకుండా చర్చల్లో నిలుస్తాయి. తాజాగా బాలకృష్ణ ఒక మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక రకాల విషయాలను, వ్యక్తులను చర్చకు పెట్టి పలు వివాదాలకు కారణమయ్యారు. ఇంటర్వ్యూలో తన తండ్రికి భారతరత్న అవార్డ్ రాకపోవడం గురించి మాట్లాడుతూ ఆ అవార్డ్ నాన్నగారి కాలి చెప్పుతో సమానం అంటూ మాట తూలారు. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందరో మహామహుల్ని వరించిన భారతరత్నను ఇలా చెప్పులతో పోల్చి కించపరిచడం సమంజసమేనా అంటున్నారు.

ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ టాపిక్ రాగానే అతనెవరో తెలియదని అనేశారు. చిత్రం ఏమిటి అంటే రహమాన్ గతంలో బాలకృష్ణ సినిమాకు వర్క్ చేశారు కూడ. అసలు రెహమాన్ ఆస్కార్ అవార్డుకు అర్హుడేనా అన్నట్టు సెలవిచ్చారు. దీంతో నెటిజన్లు ఈమధ్య బాలయ్య ఆలపించిన శివశంకరి పాటను గుర్తిచేస్తూ రెహమాన్ ఎవరో తెలియదా అంటూ చురకలు వేస్తున్నారు. ఇవేనా ఇంకా పలు విషయాల్లో బాలకృష్ణ నోటికి పనిచెప్పారు. తాను హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ కంటే గొప్ప అనడం, శ్రీదేవికి తన తండ్రి ఎలా పాఠాలు నేర్పారో పచ్చిగా చెప్పడం లాంటి మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.

- Advertisement -

Related Posts

పవన్ గురించి రానా ఆసక్తికర కామెంట్స్

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్ మీద భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఈ మూవీ రెండు పాత్రల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. మరి...

కరోనా మూడో వేవ్: కేరళకు ఏమయ్యింది.?

దేశంలోకి మొదట కరోనా వైరస్ ప్రవేశించిందే కేరళ రాష్ట్రం ద్వారానే. చైనా నుంచి వచ్చిన ఓ కేరళ వ్యక్తి కరోనా వైరస్‌ని దేశంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దేశంలో కరోనా వైరస్ విస్తరించడానికి...

కేంద్రం కాఠిన్యం: విశాఖ ఉక్కు పరిశ్రమపై వారికి హక్కు లేదా.?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్రం రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేంద్రం పేర్కొన్న అంశాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.....

Latest News