Balakrishna: బాలయ్య బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… లక్ష్మీ నరసింహ మూవీ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

Balakrishna: టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. డబుల్ హ్యాట్రిక్లను అందుకున్నారు బాలయ్య బాబు. అఖండ సినిమా నుంచి విడుదలైన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ 2 మూవీలో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం బాలయ్య బాబు అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుదల అయినా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబు అభిమానులకు కిక్ ఇచ్చే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే బాలయ్య బాబు హీరోగా నటించిన లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ కానుంది. బాలయ్య బాబు చాలా సినిమాలలో పోలీస్ క్యారెక్టర్లలో నటించారు. వాటన్నింటిలో లక్ష్మీ నరసింహ సినిమా మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి. 2003లో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన సామి చిత్రాన్ని తెలుగులో లక్ష్మీ నరసింహ మూవగా రీమేక్ చేశారు.

జయంతి సి.పరాన్జీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో బాలకృష్ణ ఏసీపీ లక్ష్మీ నరసింహగా పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. సంక్రాంతి కానుకగా 2004, జనవరి 14న రిలీజైన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో సూపర్‌ హిట్‌గా నిలిచిపోయింది. ఇకపోతే ప్రతి ఏడాది బాలయ్య బాబు అభిమానులకు జూన్ 10 వచ్చింది అంటే పండగ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటె ఆ రోజున బాలయ్య బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులు థియేటర్ల వద్ద భారీగా సందడి చేస్తూ ఉంటారు. ఈసారి ఆ సందడి రెట్టింపు కానుంది. ఎందుకంటే బాలయ్య బాబు నటించిన లక్ష్మీనరసింహ సినిమాను బర్తడే సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. అయితే బర్త్డేకి మూడు రోజుల ముందు అనగా జూన్ 7వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ విడుదల చేయనుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో పాటు బాలయ్య బాబు కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తాయేమో అని అభిమానులు కూడా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.