Balakrishna: మీసం ఊడింది….గమ్ ఏది అయ్యయ్యో చూసుకోవాలి కదా బాలయ్య… ఇలాగైతే ఎలా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా మాత్రమే కాకుండా ఈయన రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ ఏదైనా మీడియా సమావేశంలో పాల్గొన్న లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యవహరించే తీరు కారణంగా సోషల్ మీడియాలో విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.

ఇకపోతే తాజాగా బాలకృష్ణకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని బసవతారకం హాస్పిటల్ లో ఈ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇక్కడ బాలకృష్ణ చిన్నారులకు పండ్లు పంచడమే కాకుండా, చిన్నారుల సమక్షంలోనే కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక అదే రోజు బసవతారకం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ తన సినిమాలకు సంబంధించిన విషయాలు అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు.

ఇలా మాట్లాడుతున్న సమయంలో బాలకృష్ణ ఒక్కసారిగా గమ్ ఏది అంటూ మాట్లాడారు అయితే ఆయనకు పెట్టుడు మీసం పెట్టడంతో అది కాస్త ఊడిపోవడంతో గమ్ ఏది అంటూ బాలయ్య మాట్లాడటంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు . ఇక ఈ వీడియో చూసిన కొంతమంది అభిమానులు అయ్యయ్యో ఇలాగైతే ఎలా బాలయ్య కనీసం చూసుకోవాలి కదా ఇలాంటివన్నీ ముందుగానే అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య విషయంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని బాలకృష్ణ తరచూ చెబుతూ ఉంటారు.