Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 టీజర్ రిలీజ్.. ఈ సారి బాక్స్ బద్దలు అవ్వాల్సిందే!

Akhanda 2: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత నాలుగు సినిమాలతో డబులు హ్యాట్రిక్ లను అందుకున్న విషయం తెలిసిందే. అఖండ, వీర సింహా రెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి వంటి నాలుగు సినిమాలతో వరుస హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కతున్న విషయం తెలిసిందే.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఇది ఇలా ఉంటే రేపు అనగా జూన్ 10 వ తేదీన బాలయ్య బాబు పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తూ ఒక టీజర్ ని విడుదల చేసారు మూవీ మేకర్స్. తాజాగా అఖండ 2 టీజర్ ని విడుదల చేసారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ టీజర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టీజర్ లో బాలయ్య బాబు ఎప్పటిలాగే తన మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశారు.

#Akhanda2 - Thaandavam  🔱 Teaser ( Telugu ) | NBK | Boyapati Srinu | Thaman S

నా శివుడి అనుమ‌తి లేనిదే.. ఆ యముడు క‌న్నేత్తి చూడ‌డు.. నువ్వు చూస్తావా.. అంటూ చెప్పిన డైలాగ్ పునకాలు తెప్పిస్తోంది. అలాగే త‌మ‌న్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తంగా టీజ‌ర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక ఈ టీజ‌ర్‌ తో చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. అఖండ 2 సినిమా కూడా సంచలను విజయాలు నమోదు చేయడం ఖాయం అని టీజర్ ని చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ టీజర్ ఆఖరిలో ఈ సినిమాను దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా డేట్ ని కూడా రిలీజ్ చేశారు.