Siddhartha : సిద్దూ మంచోడు కాదు. ఔను, అస్సలు మంచోడు కాదు. ఒకే ఒక్క ట్వీట్.. హీరో సిద్దార్ధని.. విలన్‌గా మార్చేసింది. కాదు కాదు, అంతకు మించి ఈ సమాజంలో వుండడానికి వీల్లేని ఓ వైరస్‌గా అతను మారిపోయాడు. గుడ్ బాయ్ సిద్దూ కాస్తా, చీడపురుగులా మారిపోవడానికి కారణమేంటి.?
సైనా నెహ్వాల్.. పరిచయం అక్కర్లేని పేరిది. టాప్ క్లాస్ క్రీడాకారిణి. పైగా, ఎప్పుడూ ఆమె వివాదాల జోలికి వెళ్ళలేదు. క్రీడారంగంలో ఎన్నో పతకాల్ని అందుకుంది.. అంతకు మించి, భారత ప్రభుత్వం నుంచి ఎన్నో పురస్కారాల్ని గెలుచుకుంది. ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
సరే, సైనా నెహ్వాల్ సాధించిన ఘనతల్ని కాస్సేపు పక్కన పెడదాం. ఆమె ఓ మహిళ. ఆ మహిళను కించపర్చడం ఎంతవరకు సబబు.? హీరో సిద్దార్ధ సోషల్ మీడియా వేదికగా, సైనా నెహ్వాల్ మీద వాడకూడని భాష వాడేశాడు. అది భాష కాదు, బూతుల పైత్యం.
‘అబ్బే, నా ఉద్దేశ్యం అది కాదు..’ అని చెప్పడం ద్వారా, ఆ బూతుకి మరింత అసహ్యాన్ని అద్దాడు. అసలెందుకిలా సిద్దార్ధ తయారయ్యాడు.? ఇదే ఇప్పుడు అందర్నీ షాక్‌కి గురిచేస్తోన్న ప్రశ్న. పబ్లిసిటీ కోరుకున్నాడో ఏమోగానీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌తో కూడిన ఓ ట్వీటేశాడు సిద్దార్ధ.. అదీ సైనా నెహ్వాల్ మీద.
అంతే, దేశమంతా సిద్దార్ధ మీద భగ్గుమంది. అతని మీద కేసుల నమోదుకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అది డబుల్ మీనింగ్ ట్వీటు గనుక, న్యాయస్థానాల్లో సిద్దార్ధకు ఊరట లభించొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. తప్పుకు దొరక్కుండా తెలివిగా తప్పు చేసేశాడు సిద్దార్ధ.
కానీ, సమాజం అతన్ని క్షమించదు. చీడపురుగు.. అన్న ముద్ర ఆయన మీద పడిపోయింది. క్షమాపణ చెప్పడం తప్ప, ఆ చెడ్డపేరుని తొలగించుకోవడానికి వీల్లేని పరిస్థితి సిద్దార్ధది. కానీ, పురుషాహంకారం ఆయనతో క్షమాపణ చెప్పిచదు.