Pawan Kalyan: పవన్ మా ఇంటి సభ్యుడే…. 200 సార్లు ఫోన్ చేసినా మాట్లాడలేదు: బాబు మోహన్

Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు బాబు మోహన్ ఒకరు. ఈయన ఎన్నో వందల సినిమాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న బాబు మోహన్ రాజకీయాలలో గడుపుతున్న సంగతి తెలిసిందే ఈయన తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఇటీవల సభ్యత్వం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాబు మోహన్ చిరు కుటుంబం గురించి అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎదుగుతున్న తీరు గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ మా కుటుంబ సభ్యుడే మా చిరు అన్నయ్య తమ్ముడు ఆయన ఇప్పుడిప్పుడే రాజకీయాలలో ఎదుగుతున్నాడు ఇప్పుడే తన గురించి నేను ఏమి పొగడనని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఇప్పుడే తన ఎదుగుదలను మొదలుపెట్టారు ఆయన ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు ఎదుగుతారు. ప్రజలే ఆయనని పొగుడుతారు అంటూ బాబు మోహన్ ఎదుగుదల గురించి మాట్లాడారు. ఇక ఇటీవల కాలంలో తాను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని కలవలేదు కానీ గత కొద్ది రోజుల క్రితం ఒక 200 సార్లు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి ఉంటాను అయితే తన పిఏలు ఫోన్ చేసి ఇలా పిఏ మాట్లాడుతున్నానని చెబుతున్నారు.

ఒకసారి బాబు మోహన్ కాల్ చేశారని చెప్పండి అంటూ తాను చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తో ఫోన్ కాల్ కూడా మాట్లాడలేకపోయాను అంటూ బాబు మోహన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లో నేను, కోట కలిసి మంచి కామెడీ ట్రాక్ చేసాం. అతను మా కుటుంబ సభ్యుడితో సమానం. రాజకీయాలలో తాను ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంటూ బాబు మోహన్ ఆకాంక్షించారు.