Baahubali 3 : ఆగిపోయిన “బాహుబలి 3″తో భారీ స్థాయి నష్టం..అసలు మేటర్ ఏమిటంటే!

Baahubali 3 : మొత్తం భారతీయ సినిమా దగ్గరే భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఎలాంటి సందేహం లేకుండా గుర్తుకు వచ్చే పేరు “బాహుబలి”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు రాజమౌళి తీసిన ఈ భారీ సిరీస్ ఒక చిరస్థాయి విజయంగా భారతీయ సినిమా దగ్గర నిలిచిపోయింది.

మరి మళ్ళీ ఈ సినిమాలను కొట్టే సినిమా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు కానీ తర్వాత ఈ సిరీస్ కి సీక్వెల్ గా “బాహుబలి 3” ని ప్లాన్ చేసిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ చేసారు. కాకపోతే దీనిని రాజమౌళి కాకుండా ఓటిటి లో మరో దర్శకునితో ప్లాన్ చేశారు.

ప్రపంచ ప్రసిద్ధ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు బాహుబలి 3 ని ఒక భారీ సిరీస్ గా ప్లాన్ చేశారు. అయితే ఈ సిరీస్ బాహుబలి 2 తర్వాత కథగా కాకుండా అసలు బాహుబలి 1 కి ముందు కథగా స్టార్ట్ చేశారు. మరి దీనిని షూటింగ్ కూడా కంప్లీట్ చేశారట కానీ రీసెంట్ గా ఈ సిరీస్ అవుట్ ఫుట్ చూసి వారికి నచ్చకపోవడంతో ఈ సిరీస్ ప్రసారాన్ని ఆపేశారట.

మరి దీనికి గాను భారీ స్థాయిలోనే నష్టం వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ కోసం ఏకంగా 150 – 180 కోట్లు ఖర్చు చేశారట. ఇప్పుడు ఇదంతా నష్టమే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా కొత్త నటులతోనే ఈ సిరీస్ ని ప్లాన్ చెయ్యగా లాస్ట్ ఇక ఇలా మిగిలిపోయింది.