హిందీలో “బాలిక వదు ” సీరియల్ లో చిన్న వయస్సులోనే నటించి తన నటనతో ఉత్తరాది మొత్తాన్ని ఊపేసింది అవికా గోర్ . ఆ సీరియల్ తెలుగు డబ్ చేసి ‘చిన్నారి పెళ్లికూతురు’ గా రిలీజ్ చేస్తే దక్షిణాదిలో కూడా సూపర్ హిట్ అయ్యింది.ఆ సీరియల్ తో సూపర్ పాపులర్ అయిన అవికా గోర్, ఆ క్రేజ్ తోనే హీరోయిన్ గా కూడా ఛాన్సులు అందుకుంది.విరంచి వర్మ దర్శకత్వంలో “ఉయ్యాల జంపాల” సినిమాతో అమ్మడు టాలీవుడ్ లో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత అవికా గోర్ కెరియర్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. యువ హీరోల సరసన నటిస్తూ వచ్చిన అవికా కెరియర్ టర్న్ తిప్పే ఒక్క పాత్ర కూడా చేయలేదు.
అయితే గ్లామర్ షో విషయం లో కూడా కొద్దిగా వెనకడుగు వేసిన అవికా ఈమధ్య తన స్లిమ్ లుక్ తో ప్రేక్షకులను అలరించింది. ఇక తెలుగులో దాదాపు కెరియర్ ముగిసింది అనుకునే టైం లో అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాలో లక్కీ ఛాన్స్ అందుకుంది.ఆమెకు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కూడా అన్నపూర్ణ బ్యానరే.. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ కూడా చైతు సరసన ఛాన్స్ దక్కింది. విక్రమ్ కుమార్ డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వస్తున్న “థాంక్యూ ” సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లకి చోటుండగా ఒక హీరోయిన్ గా అవికా గోర్ కు ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. అవికా గోర్ కు నిజంగానే ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీ తో అమ్మడి రాత మారుతుందేమో చూద్దాం.