లేటెస్ట్ : మైండ్ బ్లోయింగ్ గా “అవతార్ 2” ట్రైలర్..ఆ విజువల్ వండర్ మీరు చూసారా..?

Avatar 2 teaser : ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “అవతార్ 2”. హాలీవుడ్ నంబర్ 1 దర్శకుడు జేమ్స్ క్యామెరున్ తెరకెక్కించిన ఈ అద్భుత మాయాజాలం మొదటి భాగం నెలకొల్పిన రికార్డులు అయితే ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. అయితే దాని తర్వాత మళ్ళీ సీక్వెల్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారికి ఈ ఏడాది గత కొన్ని రోజులు కితమే సమాధానం అందించారు.

అయితే అప్పుడు కొంతమంది కి స్పెషల్ షో అలాగే ఆ తర్వాత హాలీవుడ్ ప్రముఖ చిత్రం రీసెంట్ గా రిలీజ్ కాబడిన “డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీవర్స్” తో సిద్ధం చేశారు. దీనితో మరి నెట్ లో చూసే వీలు లేదా అంటే ఇప్పుడు వారి కోసం చిత్ర బృందం ఆ మైండ్ బ్లోయింగ్ టీజర్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇది మాత్రం మాటల్లో వర్ణించ లేని విధంగా ఉందని చెప్పొచ్చు. అప్పుడు జేమ్స్ మాయాజాలం కి అంతా మెంటల్ అయ్యిపోయారు. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాక అంతకు మించి ఉందని చెప్పాల్సిందే.

ఆ గ్రాండ్ విజువల్స్ గాని నెవర్ బిఫోర్ గా కనిపిస్తున్నాయి. ఇంకా సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ద వే ఆఫ్ వాటర్ అనే దానికి చూపించిన ఆ సరికొత్త విజువల్స్ ఆ నీటిలోని జంతువులు అంతా ఇక మరో ప్రపంచమే.. ఒకసారి గాని చూస్తే అది మీకే అర్ధం అవ్వొచ్చు. ఇక ఫైనల్ గా అయితే మాత్రం మరోసారి వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఇంకో రెండు మూడు దశాబ్దాలు లేదా మరో అవతార్ సినిమా వచ్చే వరకు అయితే బీట్ చెయ్యలేని వసూళ్లు కొల్లగొడుతుంది అని చెప్పాల్సిందే.

Avatar: The Way of Water | Official Teaser Trailer