Avantika Dassani : ‘మై నే ప్యార్ కియా’ మూవీ అప్పట్లో ఓ సంచలనం. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన ఈ సినిమాని తెలుగులో ‘ప్రేమ పావురాలు’ పేరుతో రిలీజ్ చేశారు. డబ్బింగ్ మూవీ అయినా, తెలుగు ప్రజలు బాగా ఓన్ చేసుకున్నారు. సంచలన విజయం అందుకుంది అప్పట్లో ఈ సినిమా.
ఈ సినిమాలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీని ఇప్పటికీ మర్చిపోరు. అంతలా తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది భాగ్యశ్రీ. అయితే, ఇప్పుడీమె పేరు తెరపైకి ఎందుకొచ్చిందంటారా.? ఈమెకు ఈమెలాగే కాదు, కాదు, అంతకన్నా అందమైన ఓ కూతురుంది. ఆ సుందరాంగి పేరు అవంతిక.
చిన్నతనం నుంచే అవంతికకు నటన పట్ల ఆసక్తి. ఆ ఆసక్తితోనే పెరుగుతూ వచ్చింది. డాన్సుల్లోనూ, ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసింది అవంతిక దాసాని. పెద్ద తెరపై హీరోయిన్‌గా వెలిగిపోవాలనుకుంటోంది. ఆ దిశగా అడుగులు వేస్తూ, వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది.
ఈ మధ్య ‘మిధ్య’ అనే పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ ఒకటి బాగా సోదిలోకి వచ్చింది. అవంతిక దాసాని నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్‌లో అవంతిక నటనకు అంతా షాకయ్యారు. తొలి వెబ్ సిరీస్‌లోనే అవంతిక చూపించిన యాక్టింగ్ టాలెంట్‌ని ప్రశంసించకుండా వుండలేకపోయారు. చాలా బోల్డ్‌గా చాలా అగ్రెసివ్‌గా కనిపించిందీ సిరీస్‌లో అవంతిక.
అవంతిక టాలెంట్ చూసిన మన తెలుగు మేకర్లు ఆమెను సాదరంగా టాలీవుడ్‌కి ఆహ్వానించేస్తున్నారట. ఆల్రెడీ ఓ తెలుగు సినిమాలో అవంతిక ఛాన్సు దక్కించుకుంది. యాక్టింగ్ టాలెంట్‌తో పాటు, హీరోయిన్ ఫీచర్స్‌కూడా పుష్కలంగా వున్నాయ్ అమ్మడిలో. బోల్డ్ యాక్ట్రస్. మాటలు కూడా బోల్డ్‌గానే వుంటాయ్. ‘మిథ్య’లో తన పాత్ర గురించి అడిగితే ఆన్ స్క్కీన్ శృంగారం తప్పేముంది.? అంటూ అంతే బోల్డ్‌గా సమాధానమిచ్చింది అవంతిక దాసాని.