Mahesh Babu: మహేష్ సినిమా అట్టర్ ఫ్లాప్… ముందే జోష్యం చెప్పిన బడా ప్రొడ్యూసర్?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలా మహేష్ బాబు కెరియర్ పరంగా బిజీగా ఉన్న తరుణంలో ఓ నిర్మాత మహేష్ బాబు సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది అంటూ షూటింగ్ సమయంలోనే సినిమా గురించి చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ నిర్మాత చెప్పింది రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి కాదండోయ్… మహేష్ బాబు గతంలో నటించిన సైనికుడు సినిమా గురించి తెలియజేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందిన వారిలో అశ్విని దత్ ఒకరు. ఈయన తన వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈయనకు విజయాలతో పాటు అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని దత్ తన బ్యానర్ లో వచ్చిన సైనికుడు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

అశ్వినీదత్ మాట్లాడుతూ.. ‘సైనికుడు’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు.. అది కచ్చితంగా ఆడదేమో అని మొదటి షెడ్యూల్ నుండే అనిపించింది. సినిమా షూటింగ్ సమయంలో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుందని అనిపించింది. ఆలస్యమైన పర్వాలేదు కొంచెం రిపేర్లు చేసే రిలీజ్ చేద్దాం అని దర్శకుడు గుణశేఖర్, హీరో మహేష్ బాబుకు చెప్పాను కానీ సినిమాని రిపేర్ చేయడం సాధ్యం కాకపోవడంతో అలాగే రిలీజ్ చేశామని అశ్విని దత్ తెలిపారు. ఇలా రిలీజ్ చేయటం వల్ల మొదటి షోకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది అప్పుడే ఒక నిర్మాతగా తాను పప్పులో కాలేశానని స్పష్టమైనది అంటూ సైనికుడు సినిమా ఫ్లాప్ అవుతుందని నిర్మాత అశ్విని ముందుగా ఊహించినట్టు ఈ విషయాలను బయటపెట్టారు.