చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

తనను తాను గొప్ప పండితుడనని గొప్పలు చెప్పుకునే వేణు స్వామి మరో సారి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అప్పుడప్పుడూ సెల‌బ్రెటీల జాత‌కాలు పొలిటిక‌ల్ లీడ‌ర్ల జాత‌కాలు ఎలా ఉన్నాయో చెబుతూ వేణు స్వామి వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంటాడు. నాగ‌చైత‌న్య, స‌మంత  విడిపోతార‌ని వేణుస్వామి చెప్పాడు. అలా వేణుస్వామి చెప్పిందే జ‌రిగింది. అంతే కాకుండా ర‌ష్మిక‌మంద‌న త‌ను పూజ‌లు చేసిన త‌ర‌వాత‌నే హీరోయిన్ గా సక్సెస్ అయ్యార‌ని వేణుస్వామి చెప్పుకుంటూ ఉంటారు.

కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కి రాయకీయాలు అచ్చురావని   చెప్పిన వేణు స్వామి మరోసారి పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మీద వ్యాఖ్యలు చేసాడు. ఏపీలో చంద్ర‌బాబు ప‌వ‌న్ పొత్తుపై వేణుస్వామి జోతిష్యం చెప్పాడు.

జ‌న‌సేన టీడీపీ బీజేపీ క‌లిసి ప‌నిచేస్తే సంచ‌ల‌నం న‌మోద‌వుతుంద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కింద చంద్ర‌బాబు, లోకేష్ ప‌నిచేస్తారా అని ప్ర‌శ్నించారు. వీళ్లు ఒకే స్టేజిపై క‌నిపిస్తే ప్ర‌పంచ వింతే అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చంద్ర‌బాబు సీఎం అభ్య‌ర్థిగా ఎన్నుకుంటే ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయ‌ని అన్నారు.

చంద్రబాబు గారిది పుష్య‌మి..ప‌వ‌న్ కల్యాణ్ ది ఉత్త‌ర ఆషాడ న‌క్ష‌త్రాలు ఈ రెండూ విరుద్దంగా ఉంటాయ‌ని అస్స‌లు ప‌డ‌వ‌ని అన్నారు. వీళ్లు దూరంగా ఉంటేనే బాగుంటారు ద‌గ్గ‌ర‌కొస్తే క‌ల‌వ‌రని చెప్పారు. జాత‌కం ప్ర‌కారం చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌లిస్తే అధికారం కాద‌ని అంద‌కారం అని అన్నారు. వీళ్లు క‌లిసినా వాళ్ల న‌క్ష‌త్రాలు క‌ల‌వ‌వ‌ని అది ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు అనుకూలంగా మారుతుంద‌ని వేణుస్వామి జోతిష్యం చెప్పారు. చూడాలి ఈసారి వేణు స్వామి జోశ్యం నిజమవుతుందో లేదో.