మళ్ళీ పవన్ కళ్యాణ్ టాటూ చూపిస్తు రెచ్చిపోయిన ఆశు.. ఆనందంలో పవన్ ఫ్యాన్స్..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ద్వార చాలామంది రాత్రికి రాత్రే స్టార్ట్ అయిపోతున్నారు. ఇలా సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోస్ , డబ్ స్మాష్ వీడియోస్ తో జూనియర్ సమంతగా పాపులర్ అయిన ఆశు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ఆశు రెడ్డి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఆశు రెడ్డి మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ లో రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ నడిపి ఈ అమ్మడు చేసిన హంగామా ఇప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేదు.

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి పలు టీవీ షోలకు కూడా హాజరయ్యారు దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారని ప్రేక్షకులు భావించారు. కానీ కొంతకాలానికి ఇద్దరు కలిసి ఎక్కడా కనిపించలేదు.ఇలా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఆశు బుల్లితెర మీద కనిపించే అవకాశం దక్కించుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కువ ఆక్టివ్ గా ఉండేది. సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ ఆశు రెడ్డీ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. తన గ్లామరస్ ఫోటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నిద్ర లేకుండా చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆశు రెడ్డి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని . ఈ క్రమంలో ఆశు పవన్ కళ్యాణ్ పేరును కూడా పచ్చబొట్టు వేయించుకుంది. ఇదివరకే ఒకసారి ఆశు రెడ్డి పవన్ కళ్యాణ్ పేరు టాటూని చూపిస్తూ ఫోటో షేర్ చేసింది. తాజాగా మరొకసారి ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ టాటూని చూపిస్తూ మరొక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ప్రైవేట్ పార్ట్ లో పవన్ కళ్యాణ్ పేరుని పచ్చబొట్టు వేయించుకున్న ఆశు ఇలా ఫోటో షేర్ చేయడంతో ఆ ఫోటో చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు నిజమైన పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ కామెంట్లు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.