విజయనగరం జిల్లాలో మహిళా దినోత్సవం రోజు మహిళకు ఘోర అవమానం జరిగింది. ప్రచారానికి వచ్చిన మహిళపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు చేయి చేసుకున్నారు. ఆమె తనపై పూలు జల్లిందనే ఆగ్రహంతో.. ఊగిపోయిన ఆయన ఒక్కసారిపై మహిళపై తిరగబడ్డారు.
తమ అభిమాన నేత వచ్చారనే గౌరవంతో మహిళ పువ్వులు చల్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు ఆ మహిళపై చేయి చేసుకున్నారు. ఆయతే ఆయనకు ఎందుకు కోపం వచ్చింది అన్నది ఎవరికీ అర్థం కాలేదు. ముందుకు వెళ్తున్న ఆయన మళ్లీ తిరిగి వచ్చి.. ఆవేశంతో రగిలిపోతూ మహిళపై దాడి చేశారు. అక్కడే ఉన్న ఇతర నేతలు ఆయన్ను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఈ వీడియోపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తారనే ఉద్దేశంతో మైక్ ఆపేయమని టీడీపీ నేతలు కోరవడం క్లియర్ గా రికార్డు అయ్యింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మాజీ మంత్రి.. అందులోనూ సౌమ్యుడిగా పేరు ఉన్న అశోక్ గజపతి రాజు చర్యపై వైసీపీ సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి.
ఎన్నికల్లో వరుస ఓటములతో ఇలా టీడీడీపీ నేతలు ఫ్రస్టేషన్ కు గురవుతున్నారని.. వారి చర్యలు చూస్తే మున్సిపల్ ఎన్నికల్లలో ఓటమి తప్పదని అర్ధమవుతోందని విమర్శిస్తున్నారు. మొన్న ఓ అభిమానిపై ఎమ్మెల్యే బాలయ్య చేయచేసుకున్నారు. అది కూడా వీడియో తీశాడనే చిన్న కారణంతోనే.. ఆ వెంటనే ఆ వీడియో వైరల్ అవ్వడంతో.. అభిమానితో టీడీపీ నేతలు వివరణ ఇప్పించారు. తన అభిమాన నటుడు చేయ తనను తాకడం చాలా ఆనందంగా ఉంది అంటూ దెబ్బ తిన్న అభిమాని వివరణ ఇచ్చాడు.
ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి అయ్యి ఉంఢి.. ఇంత పెద్ద వయసులో ఒక మహిళపై చేయి చేసుకోవడం ఏంటని మండిపడుతున్నాయి వైసీపీ, సహా ఇతర పార్టీలు. దీనిపై సంచయితా గజపతి రాజు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ ప్రశ్నించారు. మహిళల దినోత్సవం రోజున ఒక మహిళపై చేయి చేసుకోవడం దారుణమని మండిపడ్డారు.