నీ ట్రైనింగ్ అలా ఉంది మరీ… సుమ గాలి తీసేసిన ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్?

మహేష్ బాబు నటించిన సర్కారీ వారి పాట సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది అభిమానుల మధ్య ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ ప్రీ రిలీజ్ వేదికపై సుమ సరదాగా తనకు అసిస్టెంట్ గా ఓ వ్యక్తిని పెట్టుకొని తనకు మైక్ ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను ప్రశ్నలు అడగమని చెప్పింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ముందుగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ వద్దకు వెళ్లి ప్రశ్నలు వేశారు. మీరు ఎన్నో ఫైట్ సన్నివేశాలను చేసి ఉంటారు కదా? మరి నిజజీవితంలో ఎవరి చేతినీ అయినా మీరు విరిచేసారా.. అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు రామ్ లక్ష్మణ్ సమాధానం చెబుతూ మేము నిజ జీవితంలో అలాంటి పనులు చేయలేదని తెలియజేశారు. ఇకపోతే రామ్ లక్ష్మణ్ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ను ప్రశ్నించారు.

ఈసందర్భంగా సుమ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ను ప్రశ్నిస్తూ మీరు ఎన్నో సెట్స్ వేస్తూ ఉంటారు కదా ఈ క్రమంలోనే ఎప్పుడైనా సెట్ ప్రాపర్టీని కొట్టేశారా? అని ప్రశ్నించగా ఒక్క సారిగా షాక్ అయిన సుమ రేయ్…ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నావో నీకు తెలుసా అంటూ అనగా వెంటనే ఆర్ట్ డైరెక్టర్ మైక్ చేతిలోకి తీసుకొని నీ ట్రైనింగ్ అలా ఉంది మరి అంటూ సుమ గాలి మొత్తం తీసేసారు. ఈ విధంగా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో ఈసరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.