అర్జెంటీనా ఫుట్ బాల్ లెజెండ్ డిగో మారడోనా ఇకలేరు. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆయన వయసు 60 ఏళ్లు. అర్జెంటీనాలో ఫుట్ బాల్ అంటే ఎంత క్రేజో.. డిగో మారడోనాకు కూడా అంత క్రేజ్. ఆయన ఫుట్ బాల్ కే లెజెండ్. 1986లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాకు కప్ అందించిన ఘనత డిగోదే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్.
ఆయనకు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగా లేదు. తన మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆపరేషన్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. కానీ సడెన్ గా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
డిగో… అర్జెంటీనాలో 1960లో జన్మించారు. ఆయన ప్రస్తుతం అర్జెంటీనా ఫుట్ బాట్ టీమ్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఫుట్ బాల్ ఆడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వరల్డ్ కప్ లలో పార్టిసిపేట్ చేశారు. 1986లో కప్ తీసుకొచ్చారు. 1990లో అర్జెంటీనా టీమ్ ఫైనల్స్ కు చేరుకునేలా చేశారు డిగో.
డిగో… తన ఫుట్ బాల్ ఆటకు 1997లోనే రిటైర్మెంట్ ప్రకటించి.. ఆ తర్వాత జట్టుకు కోచ్ గా వ్యవహరించారు. ఆయన అకాల మరణంతో యావత్ ఫుట్ బాల్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫుట్ బాల్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.