Sreeja: శ్రీజ, కళ్యాణ్ విడాకులు తీసుకోబోతున్నారా? సాక్ష్యం ఇదేనా?

Sreeja: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఏ ఇద్దరు భార్య భర్తలు కలిసి కనిపించకపోయినా, సోషల్ మీడియాలో ఏమైనా తేడా వచ్చినా వారి వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా మెగాస్టార్ కూతురు శ్రీజ కూడా తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అంటూ ప్రచారం చేయడంతో పాటు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ ల ప్రవర్తన కూడా ఆ రూమర్స్ నిజమేనని అనిపించేలా చేస్తున్నారు.

ఇకపోతే మెగాస్టార్ చిన్న కూతురు అయిన శ్రీజ అప్పట్లో తన ఇంస్టాగ్రామ్ పేరును మార్చడం అంతేకాకుండా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడం అందరికీ అనుమానం కలిగేలా చేశాయి. తాజాగా కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీజ నుంచి ఏలాంటి శుభాకాంక్షలు తెలపక పోవడం కూడా పలు విమర్శలకు తావిస్తోంది. కానీ వారి కూతురు మాత్రం తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, ఆ సమయంలో పాప కళ్యాణ్ తోనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. మొదటి భర్తతో ఒక పాపకు జన్మనిచ్చిన శ్రీజ విడాకులు అయ్యాక కూడా ఆ పాపను తనతో ఉంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పాప ఇప్పుడు చిరంజీవి దంపతులతో ఉంటున్న విషయం కూడా కొత్తదేం కాదు.

కానీ ఆమె తన రెండో భర్తతో జన్మనిచ్చిన పాప మాత్రం ప్రస్తుతం అతనితోనే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రెండవ భర్త కూతురు శ్రీజ ఎందుకు దూరంగా పెట్టింది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ? అన్న అంశాలు ప్రస్తుతం ఎవరికీ అంతుపట్టడం లేదు.

కానీ నీ శ్రీజ మాత్రం తన రెండో భర్తతో పుట్టిన పాపను తనతోనే ఉంచుకుంటుందని, ఆ పాప అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఆమె ఆ పాపకు సంబంధించిన ప్రతి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏమి జరగకుండానే ఏదో జరిగిందంటూ ఇలా పుకార్లు పుట్టించి మరోసారి మెగాస్టార్ ఫ్యామిలీ పరువు తీసేలా ప్రయత్నిస్తున్నారంటూ కొందరు మెగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆ దంపతులిద్దరూ ఏదో ఒక క్లారిటీ ఇచ్చేవరకు ఇలాంటి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టలేమేమో.