Charan and NTR : చరణ్ – ఎన్టీయార్ మళ్లీ చేతులు కలపబోతున్నారా.?

Charan and NTR

Charan and NTR : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’తో తిరుగులేని హిట్ కొట్టి, తెలుగు సినిమా ఖ్యాతిని ఇంకో మెట్టు పైకెక్కించారు. సినిమా వరకూ ఇది చాలా చాలా గొప్ప విషయం. కరోనా కారణంగా, ఇతరత్రా కారణాలతో చచ్చిపోతుందన్న సినీ పరిశ్రమకు ఊపిరి అందించినట్లయ్యింది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో.

సరే, అది సినిమాకి సంబంధించిన విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అది కాదులెండి. ఈ సినిమాతో చరణ్, ఎన్టీయార్ మధ్య బలమైన స్నేహ బంధం ఏర్పడింది.. అందులో నో డౌట్. ఆ స్నేహాన్ని మరింత బలపరచుకునే దిశగా ఈ ఇద్దరు స్టార్ హీరోలూ ప్లాన్ చేస్తున్నారట.

సినిమాల సంగతి అటుంచితే, కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలు బిజినెస్ పాట్నర్లుగా కూడా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, చరణ్, ఎన్టీయార్ చేయబోయే బిజినెస్ ఆ టైపు కాదట.

లాభాపేక్ష లేని ఓ బిజినెస్ అన్నమాట. అంటే, ఇదో సేవా సంస్థలాంటిది అనుకోవచ్చేమో. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ బిజినెస్ చరణ్, ఎన్టీయార్ కాదట. ఉపాసన, లక్ష్మీ ప్రణతి కలిసి చేయబోతున్నారట. దీన్నొక బ్రాండ్‌గా వారు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారట. చరణ్, ఎన్టీయార్‌కి ఎలాగూ సమాజం పట్ల సేవా కార్యక్రమాల పట్ల మంచి అవగాహన వున్న సంగతి తెలిసిందే.

అటు ఉపాసన ఆల్రెడీ హాస్పిటల్, ఇతరత్రా వ్యవహారాల పేరు చెప్పి సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతేనే వుంటుంది. ఇక ఇప్పుడు లక్ష్మీ ప్రణతి కూడా జాయిన్ అవ్వబోతుందన్న మాట.