AR Rahaman: టాలీవుడ్ దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి మనందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది అంటే ఆ సినిమాకు కచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ఉండాల్సిందే. అదేవిధంగా సుకుమార్ రైటింగ్స్ అయినా చాలా వరకు దేవి శ్రీ ప్రసాద్ పనిచేస్తూ ఉంటారు. ఇక సుకుమార్ ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం పనులన్నీ కూడా దేవిశ్రీప్రసాద్ చూసుకుంటూ ఉంటారు. ఇకపోతే సుకుమార్ సినిమాలకు దేవీశ్రీప్రసాద్ అందించినవీ అన్ని కూడా హిట్ ఆల్బమ్స్ అని చెప్పవచ్చు.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇటీవల విడుదలైన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. ఇక పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ అయితే నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోయింది. ఇకపోతే ప్రస్తుతం పుష్ప సినిమా పార్ట్ 2 కి దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ను ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సుకుమార్ కాంపౌండ్ లోకి ఏ ఆర్ రెహమాన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
సుకుమార్ తన శిష్యుడుతో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను సుకుమార్ తో పాటు మైత్రి మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఇక ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ని అనుకుంటున్నారు. దర్శకుడు సుకుమార్ గనుక దేవి శ్రీ ప్రసాద్ ను రికమెండ్ చేయకపోతే రెహ్మాన్ దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లే అని చెబుతున్నారు. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మధ్య కాలంలో ఏఆర్ రెహమాన్ సినిమాల్లో పని చేయడం చాలా వరకు తగ్గింది చేశారు. ఎక్కువ ప్రైవేట్ ఆల్బమ్స్ పై దృష్టిని పెట్టారు. అంతేకాకుండా తనకు కెరిర్ లో ఎక్కువగా తమిళ హిందీ సినిమాలకు పనిచేశారు ఏఆర్ రెహమాన్.