Sandhya Raju: సంధ్యారాజు డాన్స్ కు ప్రశంసలు కురిపించిన ఏఆర్ రెహమాన్!

Sandhya Raju: ప్రముఖ నటి, కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు చేసిన డాన్స్ పర్ఫామెన్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇటీవలె ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజి లో ‘ ఫినామినల్ ఉమెన్’ కు సంబంధించిన ఒక ఇంగ్లీష్ పద్యముకు క్లాసికల్ కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్స్ రూపొందించి తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఇక ఆ వీడియోలో డాన్సర్ సంధ్య రాజు తన నాట్యంతో బాగా ఆకట్టుకుంది. అలా ఆ డాన్స్ వీడియో చూసిన ఏఆర్ రెహమాన్ సంధ్యా రాజు పై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

YouTube video player