హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ పై ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేసారు. ప్రభుత్వం గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయ నాయకుడిగా ఆయన అనుభవం ఏపాటిదో ఓసారి పరిశీలించుకుంటే? పాలన ఎలా ఉంటుందో అర్ధమవుతుందన్నారు. అంతకంటే ముందు మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. అమ్మాయి కనిపిస్తే ముద్దులు పెట్టడం..కడుపు చేయడం వంటి అభ్యంతరకర వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. ఒక మాట మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం. ఎలా మాట్లాడుతున్నాం..ఎవరు గురించి మాట్లాడుతున్నామన్నది పూర్తిగా అర్ధం చేసుకుని మాట్లాడాలన్నారు.
ఆయన వైఖరి చూస్తుంటే నిజంగానే మానసిక స్థితి సరిగ్గా లేదనిపిస్తుందని మండిపడ్డారు. బాలకృష్ణ ఓ నిర్మాతపై కాల్పులు జరిపినప్పుడు ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. అది నిజంగా నిజం అనిపిస్తుందని కోరుముట్ల ఎద్దేవా చేసారు. బాలయ్య మానసిక స్థితిపై ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాస్తానన్నారు. హిందుపురం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యలను గాలికి వదిలేసి ఇష్టానుసారం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సబబు కాదన్నారు. ఎన్టీఆర్ కుమారిడిగా ఆయనపై అందరికీ అభిమానం ఉంటుంది. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును భుజాన వేసుకుని మోస్తున్నారు.
ఇలాంటి వాస్తవాలు అన్నింటినీ బాలకృష్ణ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎద్దేవా చేసారు. అలాగే ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-సినిమా ఇండస్ర్టీ పెద్దల భేటీపై కూడా బాలయ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అందరూ కలిసి ముకుమ్మడిగా భూములు పంచుకుంటున్నారో? ఏమో అని బాలయ్య అన్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైకాపా నాయకులు బాలయ్య మానసిక స్థితి గురించి ఆరోపించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు బాలయ్యను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది.