Nara Lokesh: నీలా దొబ్బేసిన డబ్బు నా దగ్గర లేదు జగన్…. హెలికాప్టర్ విషయంలో కౌంటర్ ఇచ్చిన లోకేష్!

Nara Lokesh: జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్మును దోచుకొని తన విలాసాలకు వాడుకున్నారు అంటూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై టిడిపి ఆరోపణలు చేసిన విషయం తెలిసినదే. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల సొమ్మును అలాగే దోచుకుంటున్నారని కేవలం లోకేష్ విహారం కోసం 172 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారంటూ వైసీపీ విమర్శలు చేశారు.

ఇలా ప్రజల సొమ్మును సొంత విలాసాల కోసం వాడటంతో టిడిపి పై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు అయితే ఈ వార్తలు నిజం కాదని ఇదివరకే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించారు. తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ వైసిపికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…

నేను హెలికాప్టర్ కొనుగోలు చేయడానికి నీలా ప్రజల నుంచి కొట్టేసిన డబ్బు నా దగ్గర లేదు జగన్ రెడ్డి గారు!ఫేక్ రాతలకు బహుమతి గా ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మీ బుద్ధి మారడం లేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా లోకేష్ చేస్తున్నటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా హెలికాప్టర్ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం అవుతుంది.మరి జగన్ మోహన్ రెడ్డిని వైసీపీని ఉద్దేశిస్తూ నారా లోకేష్ చేసిన ఈ పోస్ట్ పై వైసిపి నాయకుల రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.