విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై హీరో రామ్ ట్విట్టర్ లో స్పందించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో కాస్త హీటును పెంచాయి. ఆ ట్వీట్లు పెద్ద దుమారమే లేపాయి. ఆ ట్వీట్ల గురించి చాలామంది చాలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.
తాజాగా.. హీరో రామ్ ట్వీట్లపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. స్పందించడం కాదు రామ్ కు సలహాలు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే సలహాతో కూడిన కౌంటర్ వేశారు నాని.
ఇదిగో రామ్… నువ్వు చంద్రబాబు మాట వింటే అంతే ఇక. చంద్రబాబు ఎవరి కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరారో అందరికీ తెలుసు. తిన్నింటి వాసాలే లెక్కపెట్టి.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు. పార్టీని లాక్కున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. చంద్రబాబు మాట వింటే బతుకు ఎలా అవుతుందో తెలియాలంటే నీ తోటి ఆర్టిస్టులు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ను అడుగు. వాళ్లే పూసగుచ్చినట్టు చెబుతారు. ఆయన మాటలు వింటే సినిమా కెరీర్ గోవిందా.. అంటూ రామ్ కు మంత్రి నాని ఉచిత సలహాలు ఇచ్చారు.
రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబు ఏం తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నారు. ఆ ఆసుపత్రి యజమాని వెనుక బడా బాబులు ఉన్నారు. రమేశ్ ఎక్కడ దాక్కున్నాడో ఏపీ మొత్తం తెలుసు. చంద్రబాబు ఇంట్లో రమేశ్ దాక్కున్నాడు.. అంటూ మంత్రి ఆరోపించారు.
చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి ఉంది. అందుకే ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. తనకు విరాళాలు ఇచ్చే వాళ్లకు మాత్రమే చంద్రబాబు అనుకూలంగా మాట్లాడుతారు. ఏ సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేయాల్సిన అవరసం సీఎం వైఎస్ జగన్ కు లేదని మంత్రి స్పష్టం చేశారు.