వైఎస్ వివేకా హత్య కేసు.. కీలక ఆదేశాలిచ్చిన హైకోర్టు

ap high court orders on ys viveka murder case

వైఎస్ వివేకానంద హత్య కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకు సంబంధించిన అన్ని రికార్డులు, ఆధారాలకు సీబీఐకి అందజేయాలంటూ పులివెందుల మెజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేసింది.

ap high court orders on ys viveka murder case
ap high court orders on ys viveka murder case

వివేకా హత్య కేసుకు సంబంధించి.. అన్ని రికార్డులను తమకు అందించాలని పులివెందుల మెజిస్ట్రేట్ ను సీబీఐ ఇంతకుముందే కోరగా… పులివెందుల మెజిస్ట్రేట్ తమకు ఎటువంటి ఆదేశాలు లేవని సీబీఐకి రికార్డులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సీబీఐ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. రికార్డులను సీబీఐకి అప్పగించాలని మెజిస్ట్రేట్ ను ఆదేశించింది.