ఏపీ వరదలు: ఎట్టకేలకు స్పందించడం షురూ చేసిన తెలుగు సినీ పరిశ్రమ

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా.. తెలుగు సినీ పరిశ్రమ స్పందిస్తుంటుంది.. సినీ పరిశ్రమలోని వ్యక్తులు వ్యక్తిగతంగా తమకు తోచిన రీతిలో విరాళాలు అందిస్తుంటారు. పరిశ్రమ తరఫున కూడా ఒక్కోసారి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, విరాళాలు సేకరించి ఆయా ప్రభుత్వాలకు అందిస్తుండడం చూశాం.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన అనూహ్యమైన వరదల నేపథ్యంలో భారీ నష్టమే చోటు చేసుకుంది. పలువురు ఈ వరదల కారణంగా దుర్మరణం పాలయ్యారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు స్పందించలేదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నించడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నేతలూ కొందరు తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేశారు.

కాగా, చిరంజీవి సహా జూనియర్ ఎన్టీయార్, మహేష్ బాబు తదితరులు తాజాగా విరాళాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి, ఎన్టీయార్, మహేష్ చెరో పాతిక లక్షల విరాళం ప్రకటించడం గమనార్హం. గతంలో కూడా.. అంటే, కరోనా విపత్తు వేళ సినీ పరిశ్రమ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు విరాళాలు అందించిన విషయం విదితమే.

అయితే, పరిశ్రమ ఇబ్బందుల్లో వున్నా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆదుకోవడంలేదన్న విమర్శ ఒకటి బలంగా వినిపిస్తోంది. కరోనా నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఇంకా ఇంకా నష్టపోతూనే వుంది.

అయినాగానీ, పరిశ్రమ తరఫున తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అవసరమైనప్పుడల్లా విరాళాల