Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక టూర్ ప్రారంభం….కొచ్చిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక టూర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈయన సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో గత కొంతకాలంగా సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు అయితే తాజాగా దక్షిణాది రాష్ట్రాలలో ఈయన పలు ఆలయాలను సందర్శించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక టూర్ లో భాగంగా పవన్ కళ్యాణ్ కొచ్చిలో అడుగు పెట్టారు.

హైదరాబాద్ నుంచి నేడు ఉదయం బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టిన ఆయన.. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఇలా కొచ్చి వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఈ పర్యటనలో మొదట దర్శించుకోనున్నారు .

ఇలా మూడు రోజులపాటు ఈ టూర్ లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా ఈయన అనంత పద్మనాభ స్వామి ఆలయం మధుర మీనాక్షి కామాక్షి , శ్రీ పరశురామ స్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈయన గతంలో మొక్కిన మొక్కులను కూడా తీర్చుకోపోతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ఆధ్యాత్మిక టూర్ వెళ్లిన సంగతి తెలుస్తోంది.

అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఏ మాత్రం యాక్టివ్గా కనిపించలేదు దాదాపు 15 రోజులుగా ఈయన కనీసం మీడియా ముందుకు కూడా రాకపోవడంతో రాజకీయాల పరంగా కూటమి పార్టీలలో విభేదాలు వచ్చాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు వీలైనంత త్వరగా చెక్ పెట్టకపోతే పెద్ద ఎత్తున కూటమి పార్టీల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి.