బాగా తీరిందా రాధాకృష్ణ ? ఎప్పుడేం చేస్తావు ?

The state BJP party leadership is struggling with the decisions being taken by the Center

పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్‌ల నైతిక విలువలను గాలికొదిలేసి.. తెలుగుదేశం పార్టీ కరపత్రికలా, ప్రసార సాధనంలా పని చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బహిష్కరించింది. తాజాగా ఏబీఎన్‌ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జి వుల్లూరి గంగాధర్ వెల్లడించారు

BJP vs ABN Channel: ఏబీఎన్ ఛానెల్, ఆంధ్రజ్యోతి పత్రికల్ని బహిష్కరించిన బీజేపీ

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పై ఏబీఎన్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో లైవ్‌లో దాడి జరిగింది. అమరావతి రైతు కమిటీ తరపున చర్చకు హాజరైన శ్రీనివాస్ అనే వ్యక్తి బీజేపీ నేతపై బహిరంగంగానే లైవ్‌లో చెప్పుతో దాడి చేసి అవమానించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై చింతించాల్సింది పోయి..తిరిగి అదే వ్యక్తిని ఇవాళ మరోసారి ఏబీఎన్ ఛానెల్ చర్చకు ఆహ్వానించింది. దాంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక నుంచి జరిగే పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆంధ్రజ్యోతిని ఆహ్వానించరాదని, ఆ టీవీ ఛానల్‌లో జరిగే చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించింది. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ ఏబీఎన్ ఛానెల్ తమకు నచ్చినవారిని డిబేట్‌కు పిలిచి..ఆ వాయిస్‌ను పార్టీ వాయిస్‌గా ప్రయత్నం చేస్తే ఏబీఎన్ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలకు కూడా ఉపక్రమిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు.