AP: ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమినేతల నుంచి సమాధానం రావడం లేదని చెప్పాలి. ఈ క్రమంలోనే వైసీపీ శాసనమండలి సభ్యులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాల గురించి వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వరుసగా ప్రశ్నలు వేస్తూ వచ్చారు.. ఇదిలా ఉండగా తాజాగా అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగంపై నేను మాట్లాడాను. మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం.
ప్రజల కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత మాపై ఉందని తెలియజేశారు. అయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అమ్మాయికి కూడా నెలకు 1500 రూపాయలు వారి ఖాతాలో వేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో ఈ విషయం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అలాగే ఉచిత బస్సు గురించి కూడా బడ్జెట్ కేటాయించలేదు అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా హక్కు అందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మేము కోరుతున్నామని బొత్స తెలిపారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ కంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మీరు కూటమి నుంచి బయటకు వచ్చే ప్రతిపక్ష హోదా తీసుకోవాలి అంటూ బొత్స వెల్లడించారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సాధ్యం కానీ హామీలను ఇచ్చారు. ఈ హామీలన్నింటిని నెరవేర్చాలి అంటే సంపద సృష్టిస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం సంపద ఎలా సృష్టించాలో నా చెవులో వచ్చి చెప్పండి అంటూ మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మేము ప్రశ్నిస్తున్నామని బొత్స తెలిపారు. ఇలా ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీల కోసం బడ్జెట్ ఎక్కడ సక్రమంగా కేటాయించలేదు అంటూ కూటమి ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ప్రశ్నించారు.
