AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ఏపీలో కీలక నేతలుగా మారిన వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇద్దరి నాయకుల లీడర్లు మాత్రం వీరి గురించి ఓ రేంజ్ లో గొప్పలు చెబుతూ ఉంటారు అలాగే ఇద్దరు కూడా కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత బిజెపితో ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇలా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో మారుమగిపోతుంది. ఇక బిజెపి ఏ ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా జాతీయస్థాయిలో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. ఇక వైయస్ జగన్ సైతం ఎన్నికలలో 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కానీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు.
ఇల రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందని చెప్పాలి. అయితే తాజాగా ఓ సర్వే దేశంలోనే పవన్ కళ్యాణ్ అలాగే జగన్ ఇద్దరిలో ఎవరు అత్యంత పాపులర్ అయిన నాయకుడు అనే విషయంపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వెలబడ్డాయి. గ్లోబుల్ బాక్స్ ఆఫీస్ అనే ఒక సర్వే ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు ఒక సర్వేని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఈ సర్వేలో దేశవ్యాప్తంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి 63% మంది సపోర్టివ్ గా చేయగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 37% మంది మాత్రమే మద్దతు తెలిపినట్టు ప్రకటించారు. దీంతో వైసిపి కార్యకర్తలు అభిమానులు మా నాయకుడు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అంటూ కామెంట్లు చేయగా జనసైనికులు మాత్రం ఇది ఫేక్ సర్వే అంటూ కొట్టి పారేస్తున్నారు.