AP: 2024 ఎన్నికలలో భాగంగా కూటమి పార్టీలు అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. 164 నియోజకవర్గాలలో విజయకేతనం ఎగరవేశాయి. ఇలా కూటమి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి ఏడాది పాలన పూర్తి అవుతుంది . మూడు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేసే విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఒకానొక సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు మంత్రులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా లోకేష్ ను నియమించాలి అంటూ ఒక వాదనని తెరపైకి తీసుకువచ్చారు దీంతో కూటమిలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మరి పవన్ కళ్యాణ్ కు ఏ పదవి ఇస్తారు సీఎం పదవి ఇస్తారా ? అంటూ జనసేన కార్యకర్తలు నాయకులు ఘాటుగా స్పందించారు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే కచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటూ డిమాండ్లు కూడా చేశారు.
ఇక ఈ విషయంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్పందించి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని ఖండించారు అయితే తాజాగా ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఈమె ఆఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ డిప్యూటీ సీఎం అని సంబోధించకుండా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అంటూ సంబోధించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారాయి. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడంతో అక్కడున్న వారు కూడా షాక్ అయ్యారు. ఇలా పురందరేశ్వరి వ్యాఖ్యలు పట్ల కూటమినేతలు కార్యకర్తలు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు అయ్యయ్యో ఏపీ సీఎం పేరు మర్చిపోతే ఎలాగా అంటూ కొందరు కామెంట్లు చేయగా భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి పేరు ఇప్పుడు చెప్పారు. అంటూ జనసైనికులు కామెంట్లు చేస్తున్నారు.