Anushka Sharma: ఆ రెండు ఓటీటీ సంస్థలతో భారీగా డీల్ కుదుర్చుకున్న అనుష్క శర్మ..?

Anushka Sharma: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుష్క శర్మ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లయిన తర్వాత నటనకు దూరంగా ఉంటున్న ఈమె డిజిటల్ మీడియాలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. అనుష్క శర్మ, కర్నేష్ శర్మ తో కలసి 2013లో స్లేట్ ఫిల్మ్జ్ సంస్థను ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి పలు విభిన్న కథాంశాలతో సినిమాలను కూడా నిర్మించింది అనుష్కశర్మ.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె నిర్మాణ సంస్థ స్లేట్ ఫిల్మ్జ్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో ఏకంగా దాదాపుగా 405 కోట్ల భారీ ఒప్పందాన్ని చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాబోయే 18 నెలల్లో అనుష్క శర్మ కు చెందిన స్లేట్ ఫిల్మ్జ్ సంస్థ 8 ప్రాజెక్ట్ ను ఈ రెండూ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఇవ్వబోతోందట. అయితే కంటెంట్ విషయంలో పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటనలు అనుష్క శర్మ సంస్థ వెల్లడించలేదు కానీ ప్రస్తుతం ప్రముఖ లేడీ క్రికెటర్ ఝలన్ గోస్వామి మీద అనుష్క శర్మ చెక్ద ఎక్స్ ప్రెస్ పేరుతో ఒక ఓటీటీ సినిమా తీసి నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వబోతోంది అని సమాచారం.

అంతే కాకుండా మరొక రెండు ప్రాజెక్ట్స్ కు అనుష్క శర్మ సంస్థతో ఒప్పందం చేసుకుంది అని నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. ఇకపోతే అనుష్క శర్మ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కు బుల్బుల్ అనే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కోసం పాతాల్ లోక్ వెబ్ సీరిస్ ను చేసింది.. మరి ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకమైన కంటెంటును అనుష్క శర్మ ఓటిటి ప్రేక్షకులకు అందిస్తుందో చూడాలి మరి. ఇకపోతే అనుష్క శర్మ సినిమాల లో నటించ పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.