టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకునే వారికి అనుష్కను మించిన ఛాయిస్ లేదు. అందుకే ఆమె కోసం నిర్మాతలు, దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ స్వీటీ మాత్రం సినిమాలు బాగా తగ్గించేసింది. ‘
‘నిశ్శబ్దం’ తర్వాత ఆమె ఒప్పుకున్నది ఒక్కటే చిత్రం. అదే యువీ క్రియేషన్స్ ప్రాజెక్ట్. చాలా నెలల కృతమే ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పింది. కానీ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో యువీ నిర్మాతలు ఆమె కోసం ఎదురుచూపుల్లో పడ్డారు.
ప్రీప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయినా కూడ షూటింగ్ మొదలుపెట్టే వీలు దొరకలేదు. ఆ ఎదురుచూపుల్లో ఉండగానే లాక్ డౌన్ పడింది. దీంతో ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్తుందని కంగారుపడ్డారు నిర్మాతలు.
కానీ ఆశ్చర్యంగా అనుష్క చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇన్నాళ్లు బరువు తగ్గే పనిలో ఉన్న ఆమె టార్గెట్ రీచ్ అవ్వడంతో కెమెరా ముందుకు రావడానికి సిద్ధమైందట.
టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ జూన్ నెలాఖరు నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించనున్నాడు.
ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని, ఇందులో మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు యువీ నిర్మాతలు.