అనూ ఇమ్యాన్యుయేల్ పరిస్థితి ఈ సారి కూడా ఇంతేనా.?

పాపం అనూ ఇమ్మాన్యుయేల్.. ఎంత ప్రయత్నించినా పాపకి లక్కు కలిసి రావడం లేదు. తనవంతుగా తాను ప్రయత్నాలు చేస్తోంది. కానీ, కలిసి రావడం లేదు. మొన్నటికి మొన్న ‘అల్లుడు శీను’ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్‌లో కనిపించింది. అందంగా ఉంది. కానీ, అభినయం పరంగా నభా నటేష్ ఎక్కువ మార్కులు కొట్టేసింది.

ఇప్పుడు ‘మహా సముద్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదేంటో ఈ సినిమాలోనూ అనూ సెకండ్ హీరోయిన్ పాత్రనే పోషిస్తోంది. అంతేనా.? రిలీజ్‌కి ముందే ఈ సినిమాలో మరో హీరోయిన్ అయిన అదితీ రావు హైదరీకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.

మహా పాత్రలో అదితీ రావు హైదరీ చాలా బాగా నటించిందనీ, చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రంటూ ఆ ‘మహా’ పాత్ర గురించి చర్చించుకుంటున్నారు తప్ప.. కనీసం అనూ పాత్ర గురించి ఏ ఒక్కరూ మాట్లాడుకోవడం లేదు.

ఏది ఏమైతేనేం, సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా, అనూ ఇమ్మాన్యుయేల్‌కి అవకాశాలు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి. చూడాలి మరి, ‘మహా సముద్రం’తోనైనా అనూ ఇమ్మాన్యుయేల్ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో.