RRR Movie Sequel : “RRR” పార్ట్ 2 పై ఫ్రెష్ అండ్ సెన్సేషనల్ క్లారిటీ ఇచ్చిన రచయిత.!

RRR Movie Sequel :  పాన్ ఇండియా టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో మరోసారి ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ ని నమోదు చేసుకున్నాడు.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు “బాహుబలి 2” తో ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ తో అంతే స్థాయి విజయాన్ని నమోదు చేశారు.

అయితే అప్పుడు బాహుబలి సినిమా విషయంలో రెండు భాగాలుగా ముందే అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు చేసిన సినిమాకి గాను ఎలాంటి సీక్వెల్ లేదని స్వయంగా రాజమౌళినే క్లారిటీ ఇచ్చాడు కానీ ఇప్పుడు రాజమౌళి తండ్రి అయినటువంటి వి విజయేంద్ర ప్రసాద్ మాత్రం గత వారం నుంచి రెండో సినిమా ఉన్నట్టు తెలిపారు.

ప్రస్తుతానికి ఐడియా లు కొన్ని ఉన్నాయని తెలిపారు.

ఇక ఇదిలా ఉండగా నిన్న ఈ సినిమాకి గాను నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లో భారీ పార్టీ ని ఇవ్వగా ఇందులో కూడా మళ్ళీ సెన్సేషనల్ క్లారిటీ ని విజయేంద్ర ప్రసాద్ అనౌన్స్ చెయ్యడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

దీనితో మాత్రం ఆల్ మోస్ట్ ఈ సినిమాకి సీక్వెల్ కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పాలి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు.

అలాగే అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు.