గాసిప్స్ : రామ్ చరణ్, శంకర్ సినిమాకి మరో అదిరిపోయే టైటిల్ ని ఫిక్స్ చేసారా?

Ram Charan Shankar

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషన్ ని రేపేందుకు సిద్ధం అవుతున్న భారీ చిత్రాల్లో దర్శకుడు శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ గా రామ్ చరణ్ మరియు దర్శకుడు శంకర్ ల కలయికలో వస్తున్న 15వ సినిమా ఇది కాగా.. 

నిర్మాత దిల్ రాజు నుంచి అయితే తమ బ్యానర్ లో 50వ సినిమాగా ఇది వస్తుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా తెరకెక్కుతుండగా శంకర్ మాత్రం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది. అయితే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ని పెడుతున్నారా అని పలు గాసిప్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారగా ఇప్పుడు మరో అదిరే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. 

అయితే ఈ సినిమాకి గాను ఇంతకు ముందు “అధికారి” అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని వార్తలు రాగా ఇప్పుడు ఈ అయితే “సిటిజన్” అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసారని బజ్ వినిపిస్తుంది. అయితే ఇది అధికారి కన్నా సాలీడ్ గా ఉందని చెప్పడంలో సందేహం లేదు. అయితే దీనిపై అధికారిక అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.