వైరల్ : “కేజిఎఫ్ చాప్టర్ 3” రూమర్స్ పై అనుకోని అప్డేట్ ఇచ్చిన నిర్మాత.!

kgf chapter 3 : ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్స్ ఓ ఒకటి అయినటువంటి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రం “కెజిఎఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు రాకింగ్ స్టార్ యష్ లు చేసిన ఈ చిత్రంలో మొదటి భాగం సెన్సేషన్ హిట్ కావడం ఇప్పుడు దానిని మించి చాప్టర్ 2 కూడా ఓ రేంజ్ ఓ హిట్ అవ్వడంతో అంతా ఎంతో ఆసక్తిగా చాప్టర్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ చాప్టర్ 3 పై మేకర్స్ సినిమా ఒక క్లారిటీ ఇవ్వగా వస్తుందో అని చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేందుకు బహుశా చాలా కాలమే పడుతుంది అనుకున్నారు కానీ ఈ సినిమా నిర్మాణ సంస్థ అయినటువంటి హోంబలే చైర్మన్ ఒక సెన్సేషనల్ క్లారిటీ ఇవ్వడం ఇండియన్ వైడ్ ట్రెండింగ్ న్యూస్ అయ్యింది.
అయితే దీనిపై ఈ సినిమా మరో నిర్మాత అయినటువంటి కార్తీక్ గౌడ వైరల్ అవుతున్న ఆ రూమర్స్ పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కెజిఎఫ్ 3 పై వస్తున్న వార్తలు ఎవరు నమ్మవద్దని మేము ఇప్పుడప్పుడే సినిమా స్టార్ట్ చెయ్యాలి అనుకోవట్లేదు అని అందుకే అందరు ఈ వార్తలు నమ్మొద్దని చెప్పారు.
ఇంకా ఈ సినిమాపై ఏమన్నా అప్డేట్ ఉంటే మేమే సమయం వచ్చినపుడు తెలియజేస్తామని ఇంకో క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇక్కడ తాను సినిమా మొదలు కోసం చెప్పాడు కానీ అసలు చాప్టర్ 3 అయితే లేదని ఎక్కడా చెప్పలేదు. అంటే ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమా కన్ఫర్మ్ అయ్యిపోయినట్టే అని చెప్పాలి.
https://twitter.com/Karthik1423/status/1525498992289017856