“పుష్ప” నుంచి హ్యాట్రిక్ హిట్ కూడా వచ్చేస్తుంది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాపై ప్రత్యేక అంచనాలు నెలకొనడానికి గల మరో ప్రత్యేక కారణాల్లో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఒకటి. ఆల్రెడీ దేవి ఇచ్చిన రెండు పాటలు ఆల్రెడీ సూపర్ హిట్ కాగా ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచి మరో హిట్ సాంగ్ కి టైం ఫిక్స్ అయ్యింది.

ఈరోజు సాయంత్రం పుష్ప నుంచి మూడో సాంగ్ పై అప్డేట్ రాబోతుంది అంతేకాకుండా ప్రోమో కూడా రిలీజ్ చేస్తారట. చిత్ర యూనిట్ చెప్తున్న దాని ప్రకారం ఈ సినిమా నుంచి ఇది మూడో డెఫినెట్ హిట్ సాంగ్ గా ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. అలాగే ఈ భారీ సినిమాని రెండు భాగాలుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.