Harihara Veeramallu : ఇండస్ట్రీ టాక్ : పవన్ భారీ సినిమాలో మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ అట.!

Harihara Veeramallu : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో తన కెరీర్ లోనే మంచి మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఉన్న ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” కూడా ఒకటి.
మన టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత పీరియాడిక్ సినిమాలను అదిరే లెవెల్లో తీయగలిగే మరో దర్శకుడు అయినటువంటి క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది.
మరి ఈ సినిమాని గ్రాండ్ స్కేల్ కి తగ్గట్టుగానే సాలిడ్ తారాగణంతో ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ మధ్య జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని తీసుకున్నారని తెలిసింది. కానీ తర్వాత ఆమె సినిమా నుంచి తప్పుకుంది. దీనితో ఆమె స్థానంలోకి నపూర్ సనన్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో మరింత ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో మరో బాలీవుడ్ హాట్ అండ్ సెన్సషనల్ బ్యూటీ నోరా ఫతేహి ఆన్ కార్డ్స్ లోకి వచ్చిందట. ఈమెని చిత్ర దర్శకుడు ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నారట. మరి అదేంటో చూడాలి.
ఇంకా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి ట్యూన్స్ అందిస్తున్నారు.