Acharya Another Trailer : ఇండస్ట్రీ టాక్ : “ఆచార్య” నుంచి మరో బిగ్ ట్రీట్ రాబోతోందా?ఇంతకీ ఏమిటంటే!

Acharya Another Trailer :  లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ సినిమా “ఆచార్య” కూడా ఒకటి. మెగాస్టార్ కెరీర్ లోనే మరో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కింది ఇది.
అయితే మెగా మాస్ మల్టీ స్టారర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చిత్ర బృందం నిన్ననే చాలా గ్రాండ్ గా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యగా అది ఇప్పుడు సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.
అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంకో క్రేజీ అప్డేట్ తెలుస్తుంది.
రీసెంట్ గా టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యిన రెండో ట్రైలర్ ట్రెండ్ లో ఈ సినిమా కూడా చేరబోతోంది అట. “భీమ్లా నాయక్”, “రాధే శ్యామ్”, “గని” సినిమాల్లానే ఇప్పుడు ఆచార్య నుంచి కూడా రిలీజ్ కి ముందు సరిగా రెండో ట్రైలర్ ని విడుదల చేస్తున్నారని తెలుస్తుంది.
అంతే కాకుండా ఈసారి పూర్తిగా ఒక ఎమోషనల్ ట్రైలర్ కట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇదెలా ఉంటుందో చూడాల్సిందే.
మరి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్ లుగా నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఈ ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.