Anjana Devi: పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవికి అస్వస్థత… హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళిన పవన్!

Anajana Devi: సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారని తెలుస్తుంది. ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో వెంటనే తనని హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం. ఇలా అంచనా దేవి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని క్యాబినెట్ సమావేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ కు సమాచారం అందడంతో పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ కూడా వదిలే హుటాహుటిన హైదరాబాద్ బయలు దేరినట్టు సమాచారం.

నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు అయితే ఈ సమావేశంలో పాల్గొనడానికి ముందుగానే పవన్ కళ్యాణ్ తల్లి అస్వస్థతకు గురయ్యారంటూ ఆయన కుటుంబ సభ్యులు సమాచారం అందవేశారు దీంతో చంద్రబాబు నాయుడుకి అసలు విషయం చెప్పి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరారని తెలుస్తోంది. అయితే అంజనా దేవికి ఏం జరిగింది ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉందనే విషయాలు తెలియాల్సి ఉంది.

గతంలో కూడా ఈమె ఇలాంటి అనారోగ్య సమస్యలకు గురి కావడంతో పెద్ద ఎత్తున అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేశారు అయితే తనకు ఎలాంటి ప్రమాదం లేదని కేవలం సాధారణ హెల్త్ చెకప్ కోసం మాత్రమే హాస్పిటల్ కి తీసుకు వెళ్లినట్టు అసలు విషయం వెల్లడించారు. ఇక ప్రస్తుతం మరోసారి కూడా ఈమె అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంజనా దేవికి ఇద్దరు కుమార్తెలతో పాటు, చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కొడుకుల అనే విషయం మనకు తెలిసిందే.