నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు సెట్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ హీరోలు, యువ హీరోలు ఉన్న కొద్దిమంది దర్శకులను వెంట వెంటనే లాక్ చేసుకుంటుంటే బాలయ్య మాత్రం వెనకబడిపోతున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా మొదలుపెట్టినా అది నానా ఇబ్బందులను ఎదుర్కొని ఎలాగో పూర్తయ్యే స్థితికి చేరుకుంది. అయితే ‘సింహ, లెజెండ్” టైంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు వీరి కాంబినేషన్ మీద. కారణం ఇద్దరి ట్రాక్ రికార్డ్. బాలయ్య వరుసగా ఆరేడు ఫ్లాప్ సినిమాలు ఇస్తే ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ కావడంతో బోయపాటి స్టార్ డమ్ అమాంతం కిందకి పడింది. దీంతో వీరికి నిర్మాతలు దొరకడమే కష్టమైంది.
ఇక బాలయ్యతో సినిమా చేయాలని ఉవ్విళ్ళూరిన యువ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తర్వాత కూడ రావిపూడి బాలయ్యతో ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు ఆయన జాబితాలో బాలయ్య లేనట్టే కనిపిస్తోంది. ప్రజెంట్ ‘ఎఫ్ 2’ చేస్తున్న ఆయన తర్వాత కూడ మహేష్ బాబుతోనే ప్రొసీడ్ అయ్యేలా ఉన్నారు. బాలయ్య సినిమా సంగతి ఏమిటీ అంటే అనుకున్నాను కానీ కుదిరేలా లేదు అన్నట్టే సమాధానం ఇచ్చారు రావిపూడి.