Anil Ravipudi: ఐటి అధికారులు కూడా సంక్రాంతికే వచ్చారు…. ఐటీ దాడులపై అనిల్ రావిపూడి కామెంట్స్!

Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు నిర్మాణ సంస్థలపై ఐటి దాడులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా దిల్ రాజు తో పాటు మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో మీడియా సంస్థలపై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తూ ప్రతి రూపాయి గురించి లెక్కలు అడుగుతున్నారు. ఇలా ఐటి అధికారులు దాడి చేసిన నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఐటి దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఈ సంక్రాంతి పండుగకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో దిల్ రాజుకు భారీ స్థాయిలో లాభాలు వచ్చాయని కూడా ప్రకటించారు. ఇలాంటి తరుణంలోనే ఒక్కసారిగా ఐటి అధికారులు దిల్ రాజు నిర్మాణ సంస్థతో పాటు మైత్రి మూవీ మేకర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు.

ఇలా ఐటీ రైట్స్ జరుగుతున్నప్పటికీ అనిల్ రావిపూడి మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వెనక విలేకరుల నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. మీ నిర్మాత ఐటి దాడులలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మీరు ఇలా సక్సెస్ మీట్ పెట్టడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ దిల్ రాజు గారి పై మాత్రమే ఐటీ దాడులు జరగలేదని ఇండస్ట్రీలో పలు నిర్మాణ సంస్థలలో ఇలాంటి రైడ్స్ జరుగుతున్నాయని తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో ఇలా ఐటి రైడ్స్ జరగడం సర్వసాధారణమని తెలిపారు అయితే మా నిర్మాత దిల్ రాజు మాత్రం నా ఒక్కడి వల్ల ఈ సినిమా విజయోత్సవాలు ఆగిపోకూడదని మీరు సినిమాని ప్రమోట్ చేయమని చెబుతూ ఈ సక్సెస్ ఈవెంట్ నిర్వహించమన్నారని తెలిపారు. ఇక మా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అలాగే ఐటి అధికారులు కూడా ఈ సంక్రాంతికి వచ్చారు అంటూ ఈయన మాట్లాడారు.

ఇక పుష్ప సినిమాకు మంచి లాభాలు రావడంతో దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా దాడి చేశారు ఇప్పుడు మీ ఇంటిపై కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ మరో విలేకరి అడగడంతో అనిల్ రావిపూడి మాట్లాడుతూ మా ఇల్లు సుకుమార్ గారి ఇంటి పక్కన లేదు ఫిబ్రవరిలో అక్కడికి షిఫ్ట్ అవుతున్న ఇప్పుడు మీరు చెప్పారు కనుక మా ఇంటి పై కూడా ఐటి అధికారులు దాడి చేస్తారేమో అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.