రాజధాని కేసులో అక్టోబర్ 5 వరకు వాయిదా వేసిన హైకోర్టు: తీపికబురు ఎవరికో!

ANDHRA PRADESH HIGH COURT EXTENDED STAY ON CAPITAL

అమరావతి: రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి మరియు ఇతరులు రాజధాని మార్పుకు సంబంధించిన కేసులపై విచారణను ఆక్టోబర్‌ 5కు వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం రాజధానిపై ఉన్న స్టేటస్‌కో అక్టోబర్‌ 5వరకు పొడిగిస్తూ ఆదేశం జారీ చేసింది. వచ్చే నెల 5 నుంచి రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సాంకేతిక కారణాల వల్లే హైకోర్టు విచారణను వాయిదా వేసినట్లు తెలిసింది. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే… వెంటనే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చెయ్యాలనుకున్న ఏ ప్రభుత్వానికి ఈ స్టేటస్ కో ఆదేశం ఇబ్బందికరమే అనుకోవచ్చు.

ANDHRA PRADESH HIGH COURT EXTENDED STAY ON CAPITAL
ANDHRA PRADESH HIGH COURT EXTENDED STAY ON CAPITAL

రాజధాని రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ వంటివారపు వేసిన పిటిషన్‌లపై ఇవాళ్టి నుంచి ఏపీ హైకోర్టు రోజువారీ విచారణ జరపాలనుకుంది. ధర్మాసనం ముందు మొత్తం 93 పిటిషన్లు ఉన్నాయి. ఇప్పుడు వాయిదా పడటంతో… అక్టోబర్ 5 నుంచి ఈ 93 పిటిషన్లపై విచారణ జరగనుంది.

రాజధాని తరలింపు కోసం చేసిన చట్టంపై ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో విధించింది.అలానే రాజధానికి సంబంధించిన కేసులు, దాఖలైన పిటిషన్లపై ఆన్‌లైన్ ద్వారా విచారణ కూడా వాయిదా పడింది. మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తదుపరి చర్యలను అడ్డుకోవాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గెజిట్ ను నిలిపివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలుచేశారు. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌లో తెలిపారు. రాజభవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. CRDA, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో శాసనససభ రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. దీంతో రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. చివరికి హై కోర్టు ఇచ్చే తీర్పు అమరావతి ప్రాంత ప్రజలకి తీపి కబురవుతుందో లేక ఏపి ప్రభుత్వానికి తీపి కబురవుతుందో వేచి చూడాలి.