Revanth Reddy: మాకు ఎవరితోనూ పోటీ లేదు…. హైదరాబాద్ మా బలం…. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ పర్యటనలో ఉన్నటువంటి ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన హైదరాబాద్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తనకు ఇండియాలో ఏ రాష్ట్రంతో పోటీ లేదని తెలిపారు. తాను ఎప్పుడు కూడా సింగపూర్ , టోక్యో, న్యూయార్క్ లాంటి దేశాలతో పోటీ పడుతున్నానని అందుకే మల్టీ నేషనల్ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోన్నానని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ఏపీ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేకత ఏమిటంటూ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పారు.

తెలంగాణ అంటేనే వ్యాపారాత్మక రాష్ట్రామని, భారత్‌లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొలి ప్రాధాన్యత తెలంగాణ, హైదరాబాదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఎంతోమంది నిపుణులు అలాగే అద్భుతమైన విద్య వ్యవస్థ ఉంది అందుకే పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు.

ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించారు మరి చంద్రబాబు హయామంలో అమరావతి కూడా బాగా అభివృద్ధి చెంది హైదరాబాద్ కి పోటీ ఇస్తుందని మీరు భావిస్తున్నారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెబుతూ… హైదరాబాద్ కి అమరావతి ఏమాత్రం పోటీ కాదని తెలిపారు కేవలం అమరావతి మాత్రమే కాదు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కత వంటి ఏ మెట్రోపాలిటన్ సిటీ కూడా హైదరాబాద్ కి పోటీ కాదు అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు.