Sreemukhi: బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యంకర్లలో శ్రీముఖి కూడ ఒకరు. తన అందంతో, అల్లరి తో యాంకర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొందింది. ఈ టీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షో ద్వార పాపులర్ అయిన శ్రీముఖి బుల్లితెర రాములమ్మ గా గుర్తింపు పొందింది. శ్రీముఖి యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా తన సత్తా చాటుకుంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించిన శ్రీముఖి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోలాశంకర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించనుంది.
ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన అందమైన ఫోటోలను , ఫన్నీగా వీడియోస్ తో ఎప్పుడూ అభిమానులకు చేరువలో వుంటుంది. ఇటీవల తన పుట్టినరోజుకి సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది. శ్రీముఖి ఇటీవల తన 29 వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకుంది. తన పుట్టినరోజున శ్రీముఖి ఆచార్య సినిమాలోని భలే భలే బంజారా అనే పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఇలా తన పుట్టినరోజుకి సంబంధించిన ఫోటోలతో పాటు డాన్స్ వీడియోని కూడాఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీముఖి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ శ్రీముఖి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ జేసింది. శ్రీముఖి ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న స రి గ మ ప ద సింగింగ్ స్టార్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది.