Anasuya: డిప్యూటీ సీఎం పక్కన చిందులు వేసిన అనసూయ…. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు. ఈమె ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా అనసూయ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా అనసూయ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరు మల్లు సినిమాలో ఒక పాటలో నటించిన సంగతి తెలిసిందే. కొల్లగొట్టి నాదిరో అంటూ సాగిపోయే ఈ పాటలో అనసూయ పవన్ కళ్యాణ్ తో కలిసి చిందులు వేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా ఈ పాటలో పవన్ కళ్యాణ్ తో కలిసి స్టెప్పులు వేసినందుకు అనసూయ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.

ఈ పాట కోసం అనసూయ సుమారు రెండు రోజుల పాటు పనిచేసినట్టు తెలుస్తుంది. ఇలా రెండు రోజుల కోసం ఈమె 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా రెండు రోజుల కోసం 50 లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. స్టార్ హీరోయిన్స్ సైతం ఒక ఐటమ్ సాంగ్ కి వారం రోజులు పాటు కష్టపడుతూ రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటిది అనసూయ రెండు రోజులకు 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అంటే అందరూ షాక్ అవుతున్నారు.

ఇలా ఈ పాటలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఈమె నటించడంతో ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సినిమా మార్చ్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.